హైదరాబాద్: మావోయిస్టు వికల్ప్ పేరుతో మరో లేఖ విడుదల చేశారు. అగ్రనేతలు దేవ్‌జీ, రాజిరెడ్డిలు మాతో ఉన్నారన్నారు. హిడ్మా సమాచారాన్ని దేవ్‌జీ చెప్పారనడం అవాస్తవమన్నారు. చికిత్స కోసం హిడ్మా విజయవాడ వెళ్లారని, విజయవాడలోని కలప, ఫర్నీచర్ వ్యాపారులు మాకు ద్రోహం చేశారన్నారు. పోలీసులు హిడ్మాను సజీవంగా పట్టుకొని చిత్రహింసలకు గురి చేశారన్నారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ బూటకమని, 13 మందిని పట్టుకుని ఎపి పోలీసులు కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.