ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ వ్లాదిమిరోవిచ్ పుతిన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. అనంతరం పుతిన్ సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
భారత్‌కు రష్యా చమురు సరఫరా సజావుగా, ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సాగుతోందని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. భారతీయ చమురు పరిశ్రమను రష్యా అత్యంత విశ్వసనీయ భాగస్వామ్యపక్షంగా భావిస్తుందని తెలిపారు. భారత్‌కు రష్యా చమురుపై అమెరికా వ్యతిరేకత గురించి ప్రస్తావించారు. అమెరికానే రష్యా ముడిచమురు తీసుకుంటూ ఉండగా, భారత్ తెప్పించుకుంటే తప్పేముంది? దీనినే హిపోక్రసీ అంటారేమోనని చురకలంటించిన విషయం తెలిసిందే.