వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్రకళా ఎస్, అర్జు న్, సురభి లలి త, శ్రీకాంత్, బుగత సత్యనారాయణ, దినేష్, జోగారావు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్‘. ఈ చిత్రాన్ని సుమలీల సినిమా బ్యానర్ పై ఎన్ హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి సందేశాత్మక కథా కథనాలతో రూపొందిన ‘కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్‘ సినిమాను ఈ నెల 12న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు బాపిరాజు. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ‘కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్‘ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత ఎన్‌హెచ్ ప్రసాద్ మాట్లాడుతూ “మా సినిమాకు శృంగారం, లైంగిక కోరికలు ఇతివృత్తంగా తీసుకున్నా ఎక్కడా అసభ్యత లేకుండా క్లీన్ గా మూవీ చేశాం. మా చిత్రాన్ని కవితాత్మకంగా రూపొందించాం”అని అన్నారు.