కాంగ్రెస్ మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా, రెండేళ్లుగా అమలుకాని హామీల సాధనే ధ్యేయంగా బిజెపి నిర్వహిస్తున్న ‘మహాధర్నా’ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు పిలుపునిచ్చారు. మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా బిజెపి సమరశంఖం పూరించిందని ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా పేర్కొన్నారు. ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచడానికి, ప్రజల పక్షాన నిలబడేందుకు బిజెపి నిర్వహిస్తున్న ‘మహాధర్నా’లో పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. ఈ నెల 7న ఉదయం 9 గంటలకు ఇందిరా పార్క్ వద్ద బిజెపి ఆధ్వర్యంలో జరుగనున్న ‘మహాధర్నా’లో పాల్గొనేందుకు తరలి రావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు.