బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. విధి నిర్వహణ లో ఉన్న ఓ వీడియో జర్నలిస్ట్ ఒక్కసారి గా కుప్ప కూలిపోయాడు .హుటా హుటినా ఆస్పత్రి కి తరలించగా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో మాజీ మంత్రి కెటిఆర్ హెచ్‌ఐఎల్‌టిపి భూ కేటాయింపి అంశం పై జీడిమెట్ల పారిశ్రామికవాడలో పర్యటించారు. అక్కడ హమాలీ అడ్డా లో కార్మికులతో మాట్లాడిన అనంతరం కెటొఆర్ ప్రభుత్వ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద, మాధవరం కృష్ణ రావు, ఎమ్మెల్సీల శంబిపూర్ రాజు, సునీత రాథోడ్, ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి,తదితరుల తో కలిసి పలు కంపెనీలలో కార్మికులతో మాట్లాడారు.
ఈ సమయం లో అక్కడ విధి నిర్వహణలో న్యూస్ కవరేజ్ కోసం వచ్చిన సీనియర్ వీడియో జర్నలిస్ట్,ఆజ్ తక్ దామోదర్ టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు అత్యుత్సాహంతో , సెల్ఫీల బెడదలో తొక్కిసలాటలో ఒకసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న తోటి రిపోర్టర్లు, గన్ మెన్లు, జీడిమెట్ల పోలీసుల సహాయంతో ఆటోలో షాపూర్ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నోటి నుండి వాంతులు చేసుకున్న దామోదర్ బ్లడ్ ప్రెషర్ పెరిగి ఒత్తిడికి లోనయ్యాడు .పరిస్థితి విషమించడంతో వైద్యులు చికిత్స అందిస్తుండగా దామోదర్ మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు వీడియో జర్నలిస్ట్ కుటుంబానికి సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.