నందమూరి బాలకృష్ణ-డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ2’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటకే ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ క్రీయేట్ చేశారు మేకర్స్. ఈవాళ(డిసెంబర్ 4) రాత్రి 8 గంటల నుంచే ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఇప్పటికే ఈ మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా అఖండ2 సినిమా టికెట్ రేట్ల పెంపుకు, ప్రీమియర్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షోకు టికెట్ ధరను రూ.600గా నిర్ధారించింది. ఇక, సినిమా విడుదలైన రోజు నుంచి మూడు రోజులపాటు మల్టీప్లెక్స్ లకు రూ.100, సింగిల్ స్క్రీన్ లకు రూ.50 చొప్పున ధరల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకే చెప్పింది.