యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ వివాహబంధంలోకి అడుగుపెట్టి గురువారంతో సంవత్సరం పూర్తైంది. మొదటి పెళ్లి రోజు సందర్భంగా శోభిత.. తన పెళ్లి వేడుకకు సంబంధించిన స్పెషల్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు, నెటిజన్లు.. ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, సమంత నుంచి వీడిపోయిన తర్వాత నాగచైతన్య..నటి శోభితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.2024 డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ ఫిల్మ్ స్టూడియోలో కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రుల మధ్య నాగచైతన్య-శోభిత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
కాగా, సమంత కూడా రెండో పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేసిన సమంత పెళ్లి చేసుకుంది. మూడు రోజుల క్రితం డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో సమంత-రాజ్ పెళ్లి జరిగింది. ఇప్పటికే వీరి వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.