అమరావతి: ప్రజలకు సేవలందించడానికి డిడివో కార్యాలయాలు ఉపయోగపడతాయని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధికి కార్యక్రమాలకు ఉపయోగపడతాయని అన్నారు. చిత్తూరులో పవన్ కల్యాణ్ పర్యటించారు. చిత్తూరు డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ గా కొత్త డిడివో కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..77 డిడివో ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. పంచాయతీ, గ్రామీణాభివృద్ధిలో భాగంగా 77 డిడివోలు ప్రారంభించామని, పదివేల మందికి ఉద్యోగాలకు పదోన్నతులు అందించామని తెలియజేశారు. పంచాయితీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఐటీ వింగ్ ఏర్పాటు చేశామని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి గ్రామీణ అభివృద్ధిశాఖ పని చేస్తుందని పవన్ పేర్కొన్నారు.