అమరావతి: ఎపిలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అనేలా కూటమి పాలన ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..తమ హయాంలో వ్యవసాయాన్ని పండగలా చేశామని తెలియజేశారు. పండగలా ఉన్న వ్యవసాయాన్ని దండగలా మార్చారని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. మొంథా తుఫాన్ తో నష్టపోయిన రైతులకు ఒక్క పైసా రాలేదని, రైతులకు హక్కుగా ఉన్న పంట బీమా పథకాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. కేజీ అరటిపండ్లు రూపాయంటే రైతులు ఎలా బతకాలి? అని జగన్ ప్రశ్నించారు. ఎపి నుంచి ఢిల్లీ, ముంబైకి రైళ్లలో 3 లక్షల టన్నుల ఎక్స్ పోర్టు చేశామని రైతులకు ఏ పంటకూ మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజీలను మూసేశారని ఈ క్రాప్ వ్యవస్థను ఎపి సిఎం చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారని జగన్ ధ్వజమెత్తారు.