ఢిల్లీ: వరుసగా రెండోరోజు ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. గురువారం 170 విమాన సర్వీసులను ఇండిగో సంస్థ రద్దు చేసింది. బుధవారం కూడా 200 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేసింది సాంకేతిక లోపం కారణంగా విమానాలను రద్దు చేశారు. రేపు కూడా ఇండిగో విమాన సర్వీసులకు అంతరాయం తప్పదని ప్రకటించారు. ఇండిగో విమానాల్లో సాంకేతిక లోపం, ఆలస్యంపై డిజిసిఎ దర్యాప్తు చేస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 28 ఇండిగో విమానాలు రద్దు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన 27 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. విమానాలు రద్దు కావడంతో ఎయిర్‌పోర్ట్‌లో అయ్యప్ప స్వామి భక్తుల ఆందోళన చేపట్టారు.