యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమ తమ చిత్రాలు ‘ప్రీ వెడ్డింగ్ షో’, ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఓ పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. బుధవారం మేకర్స్ ఈ చిత్రం టైటిల్ ’ఓ.! సుకుమారి’ని విడుదల చేశారు. ఆకట్టుకునే పోస్టర్‌ను మేకర్స్ ఆవిష్కరించారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.