గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’అఖండ 2: తాండ వం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తం గా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూ మి, ఆంధ్ర నా ఆత్మభూమి. ఈ చిత్రాన్ని వివిధ దేశాలలో 130 రోజుల్లోనే అద్భుతంగా చిత్రీకరించాం. దేవుని దయ లేకుండా ఇది సాధ్యం కాదు.
ఈ సినిమాలో సనాతన ధర్మం పరాక్రమం చూస్తారు. భవిష్యత్ తరాలు ఈ సినిమా ద్వారా సనాతన ధర్మం గురించి నేర్చుకుంటారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌తో వరుసగా హిట్లు కొట్టాం. ‘అఖండ 2’ ఆ జాబితాలో చేరుతుంది”అని అన్నా రు. డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ “ఈ సిని మా ఆడియన్స్‌ని కమర్షియల్‌గా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆ పరమశివుడే మీ ముందుకు వచ్చి ఒక మంచి సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఆ సందే శం దేశం ధర్మం దైవం వేదం.. ఇది కమర్షిల్‌గా అద్భుతంగా చెప్పడం జరిగింది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైజి మహేంద్రన్, విజి చంద్రశేఖర్, కొట్టి పాల్గొన్నారు.