హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత ఎవిఎం శరవణన్ (85) కన్నుమూశారు. అనారాగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.
తమిళ్, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలను శరవణన్ నిర్మించారు. దాదాపు 300 పైగా సినిమాలను ఎవిఎం సంస్థ నిర్మించింది. సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటి అడక్కు, మెరుపుకలలు, శివాజీ, లీడర్ సహా పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు. శరవణన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.