మన తెలంగాణ/హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో విలీనం అయ్యే 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలోని ఫైళ్లను స్వాధీనం చేసుకోవాలని ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఫైళ్ల స్వాధీనానికి సంబంధించి బుధవారం సా యంత్రం జీహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. జిఓ 264కు లోబడి ఆ యా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల అధికారు లు వెంటనే ఫైళ్లను జోనల్ కమిషనర్‌లకు అప్పగించాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసిలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లను విలీనం చే యాలని నవంబర్ 25వ తేదీన కేబినెట్ ఆమో దం తెలిపింది.
ఈ విలీనం నేపథ్యంలో ఎన్‌ఓసీ లు, అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల అధికారులు అక్రమాలకు తెరలేపడంతో ‘మన తెలంగాణ’ దినపత్రికలో నవంబర్ 29వ తేదీన ‘శివారు మున్సిపాలిటీల్లో పెండింగ్ ఫైళ్లకు రెక్కలు’ అనే పేరుతో కథనం ప్రచురితం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఫైళ్లను స్వాధీనం చేసుకోవాలని జీహెచ్‌ఎంసి కమిషనర్‌కు ఆదేశా లు జారీ చేసింది. వెనువెంటనే జీహెచ్‌ఎంసి క మిషనర్ ఫైళ్లను వెంటనే జోనల్ కమిషనర్‌లకు స్వాధీనం చేయాలని,ఆ ఫైళ్ల వివరాలను ఫార్మాట్‌లో పంపాలని ఆయా కమిషనర్‌లకు జీహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్‌వి కర్ణన్ సూచించారు.
ఆందోళన వ్యక్తం చేస్తున్న అధికారులు
జీహెచ్‌ఎంసిలో విలీనం అయ్యే జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, కొంపల్లి, అమీన్‌పూర్, మీర్‌పేట్, తెల్లాపూర్, ఫీర్జాదిగూడ, జవహర్‌నగర్, బండ్లగూడ జాగీర్‌లు (మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లలో) జరుగుతున్న అవినీతిపై భారీగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. పాత పైళ్లన్నీ క్లియర్ చేయాలన్న ఉత్సాహాంతో అధికారులు రాత్రివరకు పనిచేయడం, పెండింగ్ ఫైళ్ల యజమానులను సాయంత్రం వేళల్లో మీటింగ్‌లు ఏర్పాటు చేయడం తదితర అంశాలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇలా, విలీన ప్రక్రియను ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో పనిచేసే అధికారులు తమకు అనుకూలంగా మలుచుకోవడంతో ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి, దానిపై విచారణ చేపట్టి ఫైళ్లను స్వాధీనం చేసుకోవాలని జీహెచ్‌ఎంసి కమిషనర్‌ను ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో అధికారులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిసింది.