బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో మారిషస్ దేశ విదేశాంగ, ప్రాంతీయ సమైక్యత, అంతర్జాతీ య వాణిజ్య శాఖ స హాయ మంత్రి హంబైరాజన్ నర్సింఘెన్ స మావేశమయ్యారు. హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో బుధవారం ఈ మర్యాదపూర్వక భేటీ జరిగింది. ఈ సందర్భంగా గత దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుతమైన ప్రగతి, అభివృద్ధి గురించి ఇరువురు చర్చించుకున్నారు. అలాగే భవిష్యత్తులో ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్య విస్తరణకు ఉన్న అవకాశాలు, పెట్టుబడులు, పరస్పర సహకారం వంటి అంశాలపై కూడా వారి మధ్య కీలక చర్చలు జరిగినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను కేటీఆర్ ఎక్స్ వేదికగా పంచుకుంటూ మారిషస్ మంత్రిని కలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.