సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును బుధవారం సెలెక్టర్లు ప్రకటించారు. ఇరు జట్ల మధ్య తొలి టి20 డిసెంబర్ 9న కటక్‌లో జరుగనుంది. వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న శుభ్‌మన్ గిల్‌కు జట్టులో చోటు దక్కింది. సూర్యకుమార్ యాదవ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రింకు సింగ్‌కు జట్టులో స్థానం దక్కలేదు. సీనియర్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రాకు చోటు లభించింది. అంతేగాక స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా జట్టులోకి వచ్చాడు. అభిషేక్ శర్మ, తిలక్‌వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబె, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, జితేశ్ శర్మలు జట్టులో స్థానం దక్కించుకున్నారు.