పంచాయితీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎన్నికల అధికారులకు లేఖ రాశారు. దానిని ఆపాలని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరుఫున ప్రచారం కోసం సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే దీనిపై జాగృతి ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. డిసెంబర్ 1వ తేదీన రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల తరుపున రేవంత్ ప్రచారం చేశారన్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరుతో గ్రామీణ ఓటర్లను ప్రలోభపెట్టే పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిసెంబర్ 2న కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల కోసం ప్రచారం చేశారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారని ఆరోపించారు. ఆయన మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ జత చేస్తున్నామని చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరారు.