ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టు మృతి చెందగా.. మరో ముగ్గురు DRG జవాన్లు చనిపోయినట్లు పోలీసులు అధికారులు తెలిపారు. బుధవారం జిల్లాలోని గంగుళూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈక్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయిన 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్ల మృతదేహాలను భద్రత బలగాలు స్వాదీనం చేసుకున్నాయి. మరో ఇద్దరు డీఆర్జీ జవాన్లు గాయపడ్డారు. ఈ ప్రాంతంలో భద్రత దళాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.