రాయ్ పూర్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీ(102), రుతురాజ్ గైక్వాడ్(105)లు అద్భుత సెంచరీలతో చెలరేగారు. తర్వాత కెప్టెన్ కెఎల్ రాహుల్(66 నాటౌట్) మరోసారి అర్థశతకంతో కీలక ఇన్నింగ్స్ తో రాణించాడు. జడేజా(నాటౌట్) 24 పరుగులు, యశస్వీ జైస్వాల్ 22 పరుగులు చేశారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్ రెండు వికెట్లు పడగొట్టగా.. నంద్రీ బర్గర్, లుంగి ఎన్గిడిలు చెరో వికెట్ తీశారు.