దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. రాయ్ పూర్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ లు అద్భుత సెంచరీలతో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. దీంతో భారీ స్కోరు దిశగా టీమిండియా దూసుకుపోతోంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు జైస్వాల్(22), రోహిత్(14)లు తర్వగా ఔటైనా.. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ, రుతురాజ్ లు ధనా ధన్ బ్యాటింగ్ తో బౌండరీలు బాదుతున్నారు. ఈక్రమంలో ఇద్దరు సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
రుతురాజ్ కేవలం 77 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇది అతనికి తొలి వన్డే శతకం. తర్వాత వేగంగా ఆడేందుకు ప్రయత్నించిన గైక్వాడ్ 105 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఇక, కోహ్లీ 90 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. తొలి వన్డేలోనూ కోహ్లీ సెంచరీ చేశాడు. ప్రస్తుతం భారత్ 38 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(100), కెఎల్ రాహుల్(14)లు ఉన్నారు.