భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా పడి ఉన్న సంచులను రైల్వే పారిశుద్ధ్య సిబ్బంది చెత్తకుప్పలో పడేసింది. అయితే, చెత్తకుప్పలో పడేసిన సంచుల్లో ఉన్న నాటుబాంబును వీధి కుక్క కొరకడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వీధి కుక్క మృతి చెందింది. పేలుడు ధాటికి రైల్వే ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రేల్వే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని చెత్తకుప్పలోని నాటుబాంబులను గుర్తించారు. అనంతరం పోలీసులు స్టేషన్ లో తనిఖీలు చేపట్టారు.