హైదరాబాద్: పాత బస్తీ చాంద్రాయణ గుట్టలో ఇద్దరు యువకుల మృతదేహాలు కనిపించిన సంఘటన కలకలంరేపింది. ఫ్లైఓవర్ కింద ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులక సమాచారం ఇచ్చారు. ఘటన స్థలంలో ఇంజెక్షన్ బాటిల్స్ ఉన్నట్టు గుర్తించారు. డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగానే మృతి చెందినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు పహాడి షరీఫ్, పిసల్ బండ వాసులుగా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.