జైశ్నవ్ ప్రొడక్షన్, మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మాణంలో. .. క్రికెట్ నేపధ్యంలో కామెడీ ప్రధాన అంశంగా సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన మూవీ ‘జిఒఎటి’. మంగళవారం మేకర్స్ అదిరిపోయే టీజర్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ దివ్యభారతి మాట్లాడుతూ “టీజర్ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరిస్తుంది”అని అన్నారు. నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ “ఒక ఫుల్ మీల్స్‌లాగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. అలాగే సమాజంలో ఉన్న ఒక సమస్యను కూడా ఇందులో చూపించాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాము”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత రవీందర్ రెడ్డి, నితిన్ ప్రసన్న పాల్గొన్నారు.