అమరావతి: జనసేన అధినేత, ఉప ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాటలను వక్రీకరించవద్దని జనసేన పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించొద్దు అంటూ జనసేన పార్టీ కోరింది. కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం తెలంగాణ ప్రజల దిష్టి అని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలను తెలంగాణ నేతలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండడంతో తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలివితక్కువ వారు అని, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శించిన విషయం విధితమే. కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి సాంకేతిక, భౌగోళిక కారణాలు ఉండగా, వాటిని రాజకీయం చేస్తూ ‘దిష్టి’ వంటి అంశాలను ప్రస్తావించడం సరికాదని పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు మండిపడ్డారు.