మలక్‌పేట: హైదరాబాద్‌లోని మలక్‌పేట చౌరస్తాలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. టివి టవర్స్ సమీపంలో టిప్పర్ లారీ అదుపుతప్పి మరో లారీ, బస్సు ఢీకొట్టింది. అనంతరం మెట్రో బిడ్జ్రి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ప్రాణప్రాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. త్రీవ ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో టిప్పర్ లారీని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.