మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/కొత్తగూడెం: ప దేళ్ల పాటు ప్రజలు అండగా నిలబడితే రాష్ట్రాన్ని దే శంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెడతానని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నె హ్రూ అమలు చేసిన ఎడ్యుకేషన్ -ఇరిగేషన్ విధానాన్ని దత్తత తీసుకొని తెలంగాణను దేశ పటంపై మొదటి స్థానంలో నిలిపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రే వంత్ రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తగూడెం లో నెలకొల్పిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని పలువురు రాష్ట్ర మంత్రులతో కలిసి ప్రారంభించి ఆయన ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన ఆనాడు తొలి ప్రధాని పండింట్ జవహర్ లాల్ నెహ్రూ దేశంలోని అకలి కేకలను పేదరికాన్ని చూసి ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ప్రపంచంతో పో టీ పడాలన్నా ఎడ్యుకేషన్, ఇరిగేషన్ పాలసే ముఖ్యమని నమ్మి అమలు చేశారని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న గొప్ప విశ్వవిద్యాలయాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ ప్రారంభించినవేనని గుర్తు చేశా రు. దేశంలో అహార ఉత్పత్తులను పెంచడానికి బాక్రానంగల్ నుంచి నాగార్జునసాగర్ వరకు, శ్రీశైలం నుంచి శ్రీరామ్‌సాగర్ వరకు నీటి పారుదల ప్రాజెక్టులను జవహర్ లాల్ నెహ్రూ నిర్మించారని తెలిపారు.
సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం వల్లనే ఈ దేశంలోని ఆకలికేకలను రూ పు మార్చి ధాన్యగారంగా తీర్చిదిద్దారని అన్నారు. తాను కూడా నెహ్రూ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎడ్యుకేష న్, ఇరిగేషన్ అభివృద్ధితోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతుందని బలంగా నమ్ముతున్నానని అన్నారు. అందుకే రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ గురుకులాలు, మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. అందులో భా గంగానే ప్రజల మద్దతుకు ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం రెం డేళ్లు గడుస్తున్న సందర్భంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ పే రు మీద ఖనిజసంపద పుష్కలంగా ఉన్న కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. విద్యాకు సంబంధించిన ప్రతి అవకాశాన్ని కొత్తగూడెం జిల్లాకు అందిస్తున్నామని సిఎం పేర్కొన్నా రు. తెలంగాణ ఉద్యమానికి ఉపిరిపోసిన పాల్వంచ ప్రాం తంలో ఏర్పాటు చేసిన ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు ఈ విశ్వవిద్యాలయానికి పెట్టుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తానన్నారు. 2004 నుంచి 2014 వరకు దేశానికి ప్రధానిగా ఉండి సంక్షోభవం నుంచి సంక్షేమం వరకు, అభివృద్ధి ఆకాశం వరకు ఎదగడానికి కారణమైన మన్మోహన్ సింగ్ పేరును దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఎర్త్ యూనివర్సిటీకి పెట్టుకున్నామని చెప్పారు. సింగరేణి లాంటివి అభివృద్ధి జరగాలనే ఎర్త్ యూనివర్సిటీని కొత్తగూడెంలో ఏర్పాటు చేశామన్నారు.
కెసిఆర్ ఇంట్లో కురిసిన సిరులు
కృష్ణా జలాలు పారే ఈ జిల్లాకు గోదావరి జలాలను కూ డా అందించేందుకే సీతారాయ ప్రాజెక్టును చేపట్టామని అన్నారు. జిల్లాలోని పత్రి బీడూ తడవాలి, పంటలు పండాలి, సిరులు కురవాలి అని తమ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో మాత్రం సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నీ కెసిఆర్ ఇంట్లో కమీషన్ల కనకవర్గం కురిపించాయో గాని బీడు పొలాలకు చుక్క నీరు పారలేదన్నారు.
మంచి సర్పంచ్‌ను ఎన్నుకోండి
ప్రజలు వేసిన ఓటు ఫలితంగా రెండేళ్ల కాలంలో మంచి పాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం బాగుండాలంటే గ్రామ స్థాయిలో పాలన బాగుండాలని, గ్రామా లు బాగుండాలి అంటే సర్పంచ్ బాగా పనిచేయాలని అన్నారు. గ్రామ సర్పంచ్ ఎన్నికలలో డబ్బులకు మద్యం బాటిళ్లకు, హాఫ్, ఫు బాటిళ్ళకు, ఇతర ప్రలోభాలకు లొంగవద్దని హితవు పలికారు. గ్రామాల్లో రాజకీయకక్షలను మాని అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి అభ్యర్థులను, పనిచేయగలిగే వారిని, అభివృద్ధి కోసం పాటుపడే వారిని ఎన్నుకోవాలని కోరారు. మందుకో డబ్బుకో వేరే వారికీ ఓటు వేస్తే అభివృద్ధి ఆగిపోతుందన్నారు.
రాష్ట్రానికి ఆయువు పట్టు ఖమ్మంలోనే ఉంది..
రాష్ట్ర పాలనకు ఆయువు పట్టు ఖమ్మం జిల్లాలో ఉందని, తెలంగాణకు తాను సిఎంగా ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లా మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల అనుకుంటే సా ధించలేనిది ఏమీ ఉండదని అన్నారు. ‘నేను ముఖ్యమంత్రిని కావచ్చు.. కానీ ముఖ్యమైన శాఖ మంత్రులు ఖమ్మం జిల్లా వాసులే.. ఇందిరమ్మ ఇళ్ళు కావాలన్నా, విద్యుత్ కావాలన్నా, ఇతర పథకాలకు నిధులు కావాలన్నా ఈ జిల్లా మంత్రులు ఇవ్వాల్సిందే..వారు అడిగిన అన్నింటికీ నేను అనుమతి ఇస్తున్నా’ అని అన్నారు.
నేడు ప్రధానిని కలుస్తా
డిసెంబర్ 8, 9 తేదీలలో జరిగే తెలంగాణ విజయోత్సవాలు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీని,తమ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళుతున్నానని తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేస్తోందని, భూమి పరిసరా లు, భూమి లోపల ఉన్న ఖనిజాల గురించి విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతాయని, ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే విద్యాలయంలకు నేడు తొలి అ డుగు వేసామన్నారు. దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని, ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి అవసరమైన వసతులు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. దేశానికే తలమానికంగా ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు మీద కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భద్రా ద్రి కొత్తగూడెంకు విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మా ట్లాడుతూ.. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పేరు పెట్టి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఈ ప్రాంతానికి ఇవ్వ డం ప్రజలకు లభించిన ప్రత్యేక గౌరవమని అన్నారు.