న్యూఢిల్లీ: ఎన్నికల సంస్కరణలపై డిసెంబర్ 9న పార్లమెంటులో విసృ్తత స్థాయి చర్చ నిర్వహించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా 12 రాష్ట్రాలలో ఓటర్ల జాబితా స్పె షల్ ఇంటెన్సివ్ రివిజన్ పై ప్రతిపక్షాలు నిరసన లు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సర్‌పై చర్చించడానికి తాము సిద్ధంగా లేమని నరేంద్రమోదీ ప్రభు త్వం మంగళవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. జాతీయ గీతం వందేమాతరం 150వ వార్షికోత్సవంపై సోమవారం డిసెంబర్ 8న లోక్ సభలో చర్చ జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 9న మంగళవారం మధ్యాహ్నం 12 గంటలనుం చి ఎన్నికల సంస్కరణలపై చర్చ జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. కిరణ్ రిజిజు మంగళవారం (డిసెంబర్ 2)న సోషల్ మీడి యా ఎక్స్‌లో ఓ పోస్ట్‌లో షెడ్యూల్‌ను ధృవీకరించారు. లోక్ సభ స్పీకర్ అధ్యక్షతన మంగళవారం అఖిలపక్ష సమావేశంలో డిసెంబర్ 8న సోమవారం మధ్యాహ్నం 12 గంటలనుంచి జాతీయ గీతం వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా లోక్ సభలో చర్చ నిర్వహించాలని,
డిసెంబర్ 9న మంగళవారం మధ్యాహ్నం 12 గంటలనుంచి ఎన్నికల సంస్కరణలపై చర్చ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 12 రాష్ట్రాలలో జరుగుతున్న సర్, విధినిర్వహణలో పలువురు బ్లాక్ స్థాయి అధికారుల మరణాలపై తక్షణం చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు మొదటి రెండు రోజులు ఉభయసభలు ఎలాంటి కార్యక్రమాలు లేకుండానే ముగిసిపోయాయి. రెండో రోజు రాజ్యసభలో కూడా ప్రతిపక్షాలు సర్ పై తక్షణ చర్చకు డిమాండ్ చేయడంతో తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. కార్యక్రమాలకు ,అంతరాయం ఏర్పడింది. దీంతో వివిధ పార్టీల నాయకులతో సంప్రదించి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు కేంద్రమంత్రి రిజిజు తెలిపారు. ఎంపీల నినాదాలతో సభ హోరెత్తింది. అయితే ప్రభుత్వం చర్చకు గడువు నిర్ణయించే ముందు సభ విధానపరమైన క్రమం ఉండాలని, సంభాషణలు జరపాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారులపై సర్ ప్రభావం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 28 మంది బ్లాక్ స్థాయి అధికారులు (బిఎస్‌ఓ) లు అధిక పనిభారం కారణంగా చనిపోయారని పేర్కొన్నారు.