మన తెలంగాణ/హైదరాబాద్: పంచాయతీ ఎ న్నికల రెండో దశ సంబంధించి నామినేషన్ల గ డువు సోమవారం సాయంత్రం ముగిసింది. నా మినేషన్ల దాఖలు చివరి రోజు మంచిరోజు కావడంతో అభ్యర్థులు భారీ ఎత్తున నామినేషన్లు దా ఖలు చేయడానికి కేంద్రాలకు వెళ్లారు. దాంతో నామినేషన్ దాఖలు చేసేందుకు సర్పంచ్, వార్డు అభ్యర్థులతో కిక్కిరిపోయాయి. అధికారులు అ భ్యర్థులకు టోకెన్లు ఇచ్చారు. సోమవారం రాత్రి వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. డిసెంబర్ 6న నా మినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. డి సెంబర్ 14న పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఉప స ర్పంచి ఎన్నిక ఉంటుంది. మూడో విడతలో 4, 150 సర్పంచ్ స్థానాలకు, 36,452 వార్డుల స్థా నాలకు ఎన్నికలు జరుగనుండగా, మంగళవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్నది.