దేశంలో ఇక నుంచి విక్రయించే ప్రతి సెల్‌ఫోన్‌లో తప్పనిసరిగా ‘సంచార్ సాథీ’ యాప్ ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలని ఫోన్ దిగుమతిదార్లు, తయారీదార్లను టెలికాం శాఖ ఆదేశించింది. 90 రోజుల్లోపు ఈ నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే విక్రయించిన ఫోన్లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ద్వారా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలని పేర్కొంది. ఈ దిశగా తీసుకున్న చర్యలకు సంబంధించిన కంప్లయెన్స్ నివేదికను 120 రోజుల్లోగా సమర్పించాలని తెలిపింది. ఈ యాప్ ఫోన్ యూజర్లకు స్పష్టంగా కనిపించేలా ఇన్‌స్టాల్ చేయాలని , మొదటిసారి డివైజ్ సెటప్ సమయం లోనే ఇది యూజర్లకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది.
ప్రస్తుతం యాపిల్, సామ్‌సంగ్, గూగుల్, వివో, ఒప్పో, షియోమీ వంటి ప్రధాన కంపెనీలు భారత్‌లో హ్యాండ్‌సెట్లు తయారు చేస్తున్నాయి. వీటికి తాజా ఆదేశాలు వర్తిస్తాయి.సంచార్ సాథీ ఉత్తర్వును ప్రతిఘటించిన యాపిల్ ప్రతిసెల్‌ఫోన్‌లో తప్పనిసరిగా సంచార్ సాథీ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలన్న టెలికాంశాఖ ఆదేశాలను పాటించడానికి యాపిల్ సంస్థ ముందుకు రావడం లేదని ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి తన ఆందోళన తెలియజేయడానికి సిద్ధమైంది.
దీనివల్ల ప్రపంచం మొత్తం మీద తమ కంపెనీ యొక్క ఇకోసిస్టమ్‌లో గోప్యత, భద్రతకు సంబంధించిన అనేక సమస్యలు లేవనెత్తుతాయని కేంద్రానికి చెప్పాలనుకుంటోంది. యాపిల్ తన యాప్ స్టోర్‌ను దాని యాజమాన్య ఐఒఎస్‌సాఫ్ట్‌వేర్‌ను కట్టుదిట్టంగా నియంతిస్తుంటుంది. ఏటా 100 బిలియన్ డాలర్ల వాణిజ్యానికి ఈ వ్యవస్థలు చాలా కీలకం. అయితే ఈ విషయంలో కోర్టును ఆశ్రయించడం కానీ లేదా ప్రభుత్వ వైఖరిని అనుసరించడం కానీ యాపిల్ చేయదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. శామ్‌సంగ్ వంటి సంస్తలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సమీక్షిస్తున్నట్టు చెప్పాయి.