గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త మీనన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “దర్శకుడు బోయపాటి శ్రీను చాలా గ్రేట్ విజన్‌తో ఈ సినిమా తీశారు. -ఈ సినిమాలో నా క్యారెక్టర్ ముఖ్యమైన సీక్వెన్స్‌లో చాలా కీలకంగా ఉంటుంది. నా క్యారెక్టర్ స్టయిలీష్‌గా ఉంటుంది. -హీరో బాలయ్య డైరెక్టర్ యాక్టర్. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తారు. ఆయనలో ఆ లక్షణం నాకు చాలా నచ్చింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు అన్నింటికీ అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో పాటలు శివుడికి నివాళిలా ఉంటాయి. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిర్మాతలు రామ్, గోపి చాలా మంచి ప్రొడ్యూసర్స్. -ఇక ప్రస్తుతం స్వయంభు సినిమాలో యాక్షన్ క్యారెక్టర్ చేస్తున్నాను. శర్వా ‘నారి నారి నడుమ మురారి’లో నాది చాలా మంచి క్యారెక్టర్. అలాగే పూరితో వర్క్ చేయడం మంచి అనుభవాన్నిచ్చింది”అని అన్నారు.