హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మాజీ సిఎం కెసిఆర్ పై ఫైరయ్యారు. బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్లిందని.. అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని కెసిఆర్ తమకు అప్పగించారని విమర్శించారు. అయినా.. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు తీసుకెళ్తున్నామని చెప్పారు. బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎలా ఉందో.. నేడు కాంగ్రెస్ పాలనలో ఎలా ఉందో చర్చ పెట్టాలని సిఎం అన్నారు.
డిసెంబర్ 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నానని.. ఉద్దండులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీను కెసిఆర్ కాలగర్భంలో కలిపారని మండిపడ్డారు. ఓయూను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతైనా ఖర్చు పెడతామని.. అంతేకాదు, ప్రపంచస్థాయిలో ఓయూను నిలబెడతాం సిఎం రేవంత్ తెలిపారు.