రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కించిన ‘ది రాజాసాబ్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజై మంచి రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంది. రీసెంట్‌గా సినిమా నుంచి మొదటి సింగిల్ కూడా రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. అది ఈ సినిమా రన్‌టైమ్ గురించి.
సాధారణంగా ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించిన సినిమాలు అన్ని మూడు గంటలపైనే రన్‌టైమ్ ఉంటున్నాయి. కానీ, మారుతి సినిమాలో అంత నిడివి ఉండవు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కూడా మూడు గంటలపైనే అంటే.. దాదాపు 3 గంటల 14 నిమిషాల నిడివి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. హారర్ కామెడీ చిత్రం కావడంతో సినిమా ఓ వైపు భయపెడుతూనే.. మరోవైపు ఆసాంతం నవ్వులు పూయిస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిజానికి ఈ డిసెంబర్‌లోనే సినిమా విడుదల కావాల్సి ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది.