హైదరాబాద్: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వకపోతే.. బిజెపిని భూస్థాపితం చేస్తామని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజమే రేవంత్ రెడ్డి సర్కార్‌ను భూస్థాపితం చేస్తుందని అన్నారు. ఇప్పటివరకూ కేంద్రం ఏ సిటీకి నిధులు ఆపలేదని తెలిపారు. ఫ్యూచర్ సిటీ ఎవరిని అడిగి కడుతున్నారని ప్రశ్నించారు.
ఇక నేషనల్ హెరాల్డ్ కేసు గురించి రామ చందర్‌రావు మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ భూముల లెక్కలు ఎవరికీ తెలియదని, సుప్రీం కోర్టు తీర్పు ద్వారానే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని అన్నారు. డిజిటల్ ఇండియాలో అనేక మార్పులు జరుగుతాయని తెలిపారు. సంచార్ సాథీ కూడా డిజిటల్ ఇండియాలో భాగమే అని.. ఏ యాప్ తెచ్చినా అది ప్రజల సంక్షేమం కోసమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్.. బిజెపిపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.