సినీ నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కోయంబత్తూర్‌లోని ఇషా యోగా సెంటర్‌లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు వీరిద్దరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సమంత, రాజ్‌లు ఇద్దరికి ఇది రెండో వివాహం కావడం విశేషం. వీరిద్దరు వివాహం చేసుకున్న వేళ రాజ్ మాజీ భార్య శ్యామలి సోషల్‌మీడియాలో పెట్టి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘ఈ అనంత విశ్వంలో మనం ఒక మూల ఉన్నాం’ అని తెలియజేసేలా ఆమె ఓ ఫోటోని షేర్ చేశారు. రాజ్, సమంతల వివాహం జరిగిన రోజు ఉదయం కూడా శ్యామిలి పెట్టిన పోస్ట్ చర్చకు దారి తీసింది. ‘‘తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు’’ అని ఆమె రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో శ్యామలికి కొందరు మద్దతు తెలుపుతున్నారు. ‘‘కర్మ ఎవరిని వదిలి పెట్టదు.. ఎవరు చేసిన కర్మ వాళ్లు అనుభవించక తప్పదు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.