హైదరాబాద్: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని శివగంగ కాలనీలో 8 ఏళ్ల బాలుడు ప్రేమ్‌చంద్‌పై వీధి కుక్కలు దారుణంగా దాడి చేశాయి. దాదాపు 15 నుంచి 20 కుక్కలు ఎగబడడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో బాలుడి చెవి తెగింది, తల, నడుము, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి కుక్కలను తరిమేశారు. చికిత్స కోసం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి నిలోఫర్ ఆసుపత్రిలోని అత్యవసర వార్డుకు తరలించారు.