భారత్‌లో క్రికెట్‌పై ఉన్నంత అభిమానం మరే ఆట మీద ఉండదు. కానీ, ఇతర ఆటల్లో మనవాళ్లు ఏదైనా ఘనత సాధిస్తే.. అది పూర్తి దేశానికే తలమానికం అవుతుంది. అదే ఇప్పుడు యంగ్ ఇండియా జట్టు చేసింది. సౌదీ అరేబియాలో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్‌కు భారత అండర్-17 పురుషుల ఫుట్‌బాల్ జట్టు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో అత్యంత బలమైన ఇరాన్ ఓడించి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని ఎకె ఏరినాలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 2-1 తేడాతో ఘన విజయం సాధించింది. గత 20 ఏళ్లో భారత్ ఆసియా కప్ ఫైనల్స్‌కు చేరడం ఇది మూడోసారి. ఆసియా కప్‌లో భారత్ ఇదే సంచలన ప్రదర్శనలు చేసి టాప్-4లో నిలిస్తే, 2027 FIFA U-17 వరల్డ్ కప్ (ఖతార్) అర్హత సాధిస్తుంది.