హైదరాబాద్: జీడిమెట్ల గ్రామం పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ చౌరస్తాలో సోమవారం రాత్రి మద్యం మత్తులో యువతి హల్‌చల్ చేసింది. తాగిన మత్తులో రోడ్డుపైకి వచ్చిన వాహనదారులను యువతి బెంబేలెత్తించి, తీవ్ర అంతరాయం కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, ఆ యువతిని అదుపులోకి తీసుకుని 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతి పోలీసులు’ఇందు’గా గుర్తించారు.