హైదరాబాద్: నంద్యాల జిల్లా హరిజన పేటలో దారుణం చోటు చేసుకుంది. దుండగులు కత్తితో యువకుడిని పొడిచి చంపారు. మరో యువకుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మృతుడు కొమ్ము పెద్దన్న(26)గా గుర్తించారు.