న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన రోజునే లోక్‌సభ సర్‌పై ప్ర తిపక్షాల ఆందోళన, గందరగోళం నడుమ, నిరసనల హోరు మధ్య వాయిదా పడింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని పావుగా వా డుకొంటోందని విపక్షాలు ఆరోపించాయి. ఇందు లో భాగంగానే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సర్‌తో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లకు గండికొడుతున్నారని విమర్శించారు. సభలో ముందుగా సర్‌పై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. ఈ దశలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఈ లోగానే ఆర్థిక మం త్రి నిర్మలా సీతారామన్ మణిపూర్‌లో జిఎస్‌టి చ ట్టం అమలకు సరైన సవరణల బిల్లును విపక్షాల నిరసనల మధ్యనే ప్రవేశపెట్టారు. స్వల్పకాలిక నా మమాత్రపు చర్చ తరువాత బిల్లు ఆమోదం పొం దిందని ప్రభుత్వం ప్రకటించింది. మణిపూర్ జిఎస్‌టి గురించి ఇంతకు ముందు ఉన్న ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లు
తీసుకువచ్చారు. మణిపూర్‌లో సుదీర్ఘ కాలంగా రాష్ట్రపతి పాలన ఉంది. దీనితో తగు శాసనం ఆమోదింపచేసే విస్తృత అధికారాలను కేంద్రం వినియోగించుకుంది. 15 సిట్టింగ్‌లతో ఖరారు అయిన శీతాకాల సమావేశాల ఆరంభం రోజునే తుపాన్ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో సభ వాయిదాకు ముందే రెండుసార్లు వాయిదా పడింది. ఉదయం క్వశ్చన్ అవర్ సాగలేదు. సభ ప్రారంభం అయిన వెంటనే ప్రతిపక్షాలు సర్‌పై చర్చకు పట్టుపట్టాయి. ప్రభుత్వం ఇందుకు కుదరదనే రీతిలో వ్యవహరించింది. దీనితో సభ తొలిరోజే ప్రతిష్టంభనల స్థాయిలో మొదలైంది. జీరో అవర్‌కు సంబంధించిన 12 నిమిషాల వ్యవధిలోనే ఆర్థిక మంత్రి సీతారామన్ మూడు బిల్లులను ప్రవేశపెట్టారు.
నిర్ణీత బిల్లులను గట్టెక్కించుకోవాలనే ఆలోచన ప్రభుత్వం కనబర్చింది. 2025 2006 సంవత్సరానికి బడ్జెట్ నిధుల అనుబంధ పద్దులను కూడా ఆర్థిక మంత్రి ఈ దశలోనే సభలో ప్రవేశపెట్టారు. పొగాకు , పొగాకు ఉత్పత్తులపై లెవి ఎక్సైజ్ సుంకానికి సంబంధించిన రెండు బిల్లులను , పాన్ మసాలాపై నూతన సెస్సుకు సంబంధించిన బిల్లును కూడా తీసుకువచ్చారు. వీటిని సెంట్రల్ ఎక్సైస్ సవరణల బిల్లు 2025, ఆహార భద్రత, జాతీయ భద్రతా సెస్ బిల్లు 2025గా తీసుకువచ్చారు. దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో సర్ ప్రక్రియను ప్రతిపక్షాలు ప్రత్యేకించి డిఎంకె, కాంగ్రెస్, టిఎంసిలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ ప్రక్రియతో పౌరులలో అభద్రతాభావం నెలకొంటోందని, నిజమైన ఓటరుకు అన్యాయం జరుగుతోందని విమర్శిస్తున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ క్రమంలోనే బిజెపి ఏకంగా ఎన్నికల సంఘం ద్వారానే ఓట్ల చోరీకి పాల్పడిందని ఘాటుగా చెపుతూ వచ్చారు. అయితే అన్ని నియమ నిబంధనలకు అనుగుణంగానే సర్ ప్రక్రియ జరుగుతోంది. దీని వల్ల నిజానికి సరైన ఓటరుకు జాబితాల్లో స్థానం పదిలం అవుతోందని, అభ్యంతరాలు తెలియచేసుకునేందుకు అవసరం అయిన ఏర్పాట్లు జరిగాయని, వీటిని సద్వినియోగం చేసుకోవల్సిన బాధ్యత పౌరులది, వారి తరఫున పార్టీల ప్రతినిధులది అని ఎన్నికల సంఘం చెపుతోంది.