ఓ మహిళా వ్యాపారవేత్త పట్ల ప్రైవేటు కంపెనీ ఎండీ అతి దారుణంగా వ్యవహరించిన సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలో చోటుచేసుకుంది. తుపాకీతో బెదిరించి ఆమెను వివస్త్రగా చేసి వేధింపులకు పాల్పడ్డాడు. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. ఫ్రాంకో- ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ ఎండి జాయ్ పాస్కల్ పోస్ట్ మీటింగ్ ఉందంటూ బాధితురాలిని ఆఫీసుకు పిలిచి తుపాకీతో ఆమెను బెదిరించి బట్టలు తీయించి నగ్నంగా ఉండగా ఫోటోలు, వీడియోలు సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు.ఈ విషయం బయట ఎవరికైనా చెప్పితే ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. అక్కడ నుండి బయటకు వచ్చిన బాధిత మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జాన్ తో పాటు మరో ఐదుగురిపై లైంగిక వేధింపుల కేసు పెట్టి విచారణ ప్రారంభించారు.