న్యూఢిల్లీ: శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌కి అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా కేంద్ర హోం శాఖ ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో శామీర్‌పేట స్టేషన్ చోటు దక్కించుకుంది. దేశంలోనే ఏడో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా (తెలంగాణలో నెం.1) నిలిచింది. ఢిల్లీలోని ఘాజీపూర్ ల్యాండ్‌ఫిల్ పోలీస్‌స్టేషన్ అగ్రస్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను హోం శాఖ ఎంపిక చేస్తుంది. తాజాగా ఎంపిక చేసిన జాబితాలో శామీర్‌పేట్ పిఎస్ చోటు దక్కించుకుంది.