కొత్తూరు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలక కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. అనుమానస్పద స్థితిలో యువతీ యువకుడు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన ఓ కార్మికుడు కొత్తూరు శివారులోని ఓ కంపెనీలో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ స్థానిక బిస్కెట్ పరిశ్రమలో కార్మికులుగా పని చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తండ్రి భోజనానికి ఇంటికి రాగా.. తలుపు గడియ లోపలి నుంచి పెట్టి ఉంది. ఎంతసేపు తలుపు కొట్టిన ఎవరు స్పందించలేదు. దీంతో కిటికీ నుంచి తలుపు గడియ తీసి లోపలికి వెళ్లాడు. ఓ గదిలో అతడి కుమార్తెతో పాటు మరో గుర్తు తెలియని యువకుడి మృతదేహాలను చూశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆ యువకుడు యువతిని హత్య చేసి ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.