మ్యూజిక్ ప్రేక్షకుల మనసులను తాకితే ఆ సినిమా అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయి. మెగాస్టార్ చిరంజీవి, -హిట్ మిషన్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అదే విషయాన్ని నిరూపించింది. ఇప్పటికే ఈ చిత్రం తన చార్ట్‌బస్టర్ మ్యూజికల్ ఆల్బమ్ తో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల ఇప్పుడు అధికారికంగా 100 మిలియన్ల వ్యూస్ మార్కును దాటింది. 2025లో బిగ్గెస్ట్ తెలుగు చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ‘మీసాల పిల్ల’కు ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్‌ల గాత్రం క్లాసిక్ టచ్ ఇవ్వగా, చిరంజీవి, నయనతారల మధ్య కనిపించే కెమిస్ట్రీ విజువల్ ట్రీట్‌గా నిలిచింది. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఈ పాట ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇదే జోరును కొనసాగిస్తూ విడుదలైన రెండో సింగిల్ ‘శశిరేఖ’ కూడా వేగంగా 35 మిలియన్ వ్యూస్ దాటింది. తాజాగా విడుదలైన మూడో సింగిల్ ‘మెగా విక్టరీ మాస్’ దూసుకెళ్తోంది. చిరంజీవి, వెంకటేశ్ కలిసి స్క్రీన్ షేర్ చేసిన ఈ హై-వోల్టేజ్ సాంగ్ విడుదలైన రోజే వైరల్‌గా మారి, ప్లేలిస్టులు, రీల్స్, ఫెస్టివల్ సెలబ్రేషన్స్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ పాట దాదాపు 8 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలకు ఫేవరెట్ నంబర్‌గా మారింది. ఈనెల 12న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ పక్కా ఫెస్టివల్ బ్లాక్‌బస్టర్‌గా అలరించడానికి సిద్ధంగా ఉంది.