రాజ్‌కోట్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాడు కృనాల్ పాండ్యా అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజరే ట్రోఫీలో బరోడా జట్టు తరఫున పరుగుల వరద పారిస్తున్నాడు. ఎక్కువ బంతితో ప్రత్యర్థులను భయపెట్టే కృనాల్.. ఈ టోర్నీలో బ్యాట్‌తోనూ రాణిస్తున్నాడు. ఈ టోర్నీలో వరుసగా బెంగాల్‌పై 57, ఉత్తర్‌ప్రదేశ్‌పై 82 పరుగులు చేసి కృనాల్.. డిసెంబర్ 31 హైదరాబాద్‌పై సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 63 బంతుల్లోనే 18 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 109 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కృనాల్‌తో పాటు ఓపెనర్ నిత్య పాండ్యా(122), అమిత్ పాసి(127) సెంచరీలతో చెలరేగడంతో బరోడా 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 417 పరుగులు చేసింది. భారీ లక్ష్య చేధనకు బరిలోకి దిగిన హైదరాబాద్ 23 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే హైదరాబాద్ జట్టుకు ఇంకా 239 పరుగులు కావాల్సి ఉంది.