భోపాల్: దేశంలోనే స్వచ్ఛ నగరంగా పేరొందిన మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో కలుషిత జలాలు ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారాయి. మురుగు కలిపిన నీళ్లు తాగడంతో డయేరియా, వాంతుల బారిన పడి, నగరంలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు.
మేయర్ పుష్యమిత్ర భార్గవ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. భాగీరథ్‌పుర ప్రాంతంలో లీకేజీ కారణంగా మురుగునీరు తాగునీటిపైప్ లోకి ప్రవేశించినట్టు ప్రాథమికంగా తేలిందని చెప్పారు. మరో 149 మంది బాధితులు నగరం లోని 27 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.