హాస్టల్ లోని స్నానాల గదిలో రహస్య కెమెరాలు అమర్చిన కేసులో ప్రేమజంటను పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. జిల్లాలోని ఉత్తనపల్లి సమీపం లాలిక్కర్ గ్రామంలో ప్రైవేటు మహిళా వసతి గృహం ఉంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన నీలుకుమారి గుప్తా(22), పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆమె ప్రియుడు రవిప్రతాప్ సింగ్(29) లు హాస్టల్ లో స్నానపు గదిలో రహస్య కెమెరాలను అమర్చారు. అది గమనించి యువతులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని గూండా చట్టం కింద అరెస్ట్ చేశారు. అనంతరం రవిప్రతాప్ సింగ్ ని సెంట్రల్ జైలుకి , నీలుకుమారిని కోవై మహిళా జైలుకు తరలించారు.