న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు టెలికం సంస్థ వోడాఫోన్ ఐడియా లి మిటెడ్ (విఐఎల్) సంస్థకు భారీ ఊరట కల్పించింది. ఈ కంపెనీ చెల్లించా ల్సిన రూ 87,695 కోట్ల బకాయిలను ఫ్రీజ్ చేసింది. ఎజిఆర్ పరిధిలో ప్ర భుత్వానికి చెల్లించాల్సిన లైనెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ వాడక రుసుం బకాయిలపై ఇప్పుడు కంపెనీకి గడువు లభిస్తుంది. బకాయిల చెల్లింపులపై ఐదేండ్ల పా టు అమలులో ఉండే మారిటోరియం విధించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్రీజ్ అంటే కంపెనీ సర్దుబాట్ల స్థూల ఆదాయం (ఎజిఆర్) ప్రాతిపదికన ్సన చెల్లింపును తాత్కాలికంగా వాయిదా వేయడం. కాలపరిమితి కల్పించడం. పూర్తి స్థాయిలో కుంటుపడే పరిస్థితిలో ఉన్న ఈ కంపెనీకి కేంద్రం నిర్ణయం అత్యంత కీలకమైన జీవనదానం (లైఫ్‌లైన్) గా మారింది. ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన బకాయిలను ఇక ఇప్పటి వెసులుబాటు కల్పన సంబంధిత మంత్రి మండలి నిర్ణయంతో చెల్లింపులను 2031 32 ఆర్థిక సంవత్సరం నుంచి ఆరంభించి , మొత్తం బకాయిలను 204041 వరకూ పూర్తిగా చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. వోడాఫోన్ ఐడియా కంపెనీల బకాయిలను 2020 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు రూలింగ్ మేరకు ఖరారు చేశారు. ఇవి మొత్తం మీద 2031 ఆర్థిక సంవత్సరానికి పూర్తిగా చెల్లించాల్సి ఉంది.
ఇప్పుడు చెల్లింపుల ఆరంభ గడువును పెంచారు. వోడాఫోన్ కంపెనీ చాలా కాలంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. తీవ్రస్థాయి ధరల పోటీ, అత్యధిక రుణాలు, భారీ స్థాయి ఎజిఆర్ చెల్లింపులు వంటి తీవ్ర స్థా సమస్యలు ఉన్నాయి. ఓ వైపు క్రమేపీ వినియోగదారుల సంఖ్య తగ్గుతూ ఉండటం, నాణ్యత పోటీ, ప్రామాణికత నిర్వహణకు అత్యధిక వనరుల సమస్య వంటి వాటివి కీలక సమస్యలు అయ్యాయి. నెట్‌వర్క్ విస్తరణ అవసరాలకు అనుగుణంగా చేయలేకపోడంతో , మరో వైపు ప్రత్యర్థి కంపెనీల సేవలలో 4 జి, 5జి ప్రసార సాంకేతికతను ప్రవేశపెట్టడం, దీనిని ఈ కంపెనీ అందుకోలేకపోవడంతో సమస్యలు సంకట స్థితికి చేర్చాయి. ఈ దశలోనే మోడీ ప్రభుత్వం ఈ కంపెనీకి ఊపిరిపోసినట్లు అయింది. కంపెనీ నిలబడగల్గింది.ప్రభుత్వం ఆడిట్ నివేదికలను అంచనా వేసుకుని, పరిస్థితులను విశ్లేషించుకుని ఇప్పుడు కేవలం ఫ్రీజ్ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక విఐఎల్‌లో ప్రభుత్వ వాటా 49 శాతం వరకూ ఉంది. నష్టాల ఊబిలో ఉన్న సంస్థకు వెసులుబాటు కల్పించడం ద్వారా ప్రభుత్వం తన ప్రయోజనాలను కూడా కాపాడుకుందని భావిస్తున్నారు. ఎంత ఇబ్బంది ఉన్నా దేశవ్యాప్తంగా ఇతరత్రా వోడా ఐడియా నెట్ వర్క్‌కు 20 కోట్ల మంది వరకూ వినియోగదారులు ఉన్నారు. వీరి ప్రయోజనాల పరిరక్షణ, ఇదే సమయంలో కంపెనీ ఇతర కంపెనీల పోటీని తట్టుకునేలా చేసేందుకు అవకాశం కల్పించాలని ఈ ఫ్రీజ్ నిర్ణయం తీసుకుందని వెల్లడైంది.
ఆరు లేన్ల నాసిక్ షోలాపూర్ కారిడార్‌కు ఆమోదం
బుధవారం నాటి కేంద్ర మంత్రి మండలి సమావేశంలో రాదార్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరు లైన్లతో నాసిక్ షోలాపూర్ అక్కల్‌కోట్ కారిడార్‌ను మహారాష్ట్రలో నిర్మించేందుకు ఆమోదం తెలిపారు. మొత్తం రూ 19,142 కోట్ల వ్యయ అంచనాలతో ఈ హరిత క్షేత్ర రాదారి నిర్మాణం జరుగుతుంది. 374 కిలోమీటర్ల ఈ కారిడార్ నిర్మాణం బిఒటి టోల్ మోడల్‌లో సాగుతుందని అధికార వర్గాలు ఆ తరువాత తెలిపాయి. ప్రత్యేకించి మహారాష్ట్రలోని ప్రధాన ప్రాంతీయ నగరాలు, పట్టణాలకు రవాణా సౌలభ్యం మరింత ఇనుమడించేలా ఈ కారిడార్ ఖరారు చేశారు. నాసిక్, అహల్యానగర్, షోలాపూర్‌ను ఎపిలోని కర్నూలుకు అనుసంధానించేందుకు ఈ కారిడార్ ఉపయోగపడుతుంది. పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ లోని అంశాల మేరకు ఈ కీలక కారిడార్ ఏర్పాటు జరుగుతుంది. పశ్చిమ తీర ప్రాంతం నుంచి తూర్పు కోస్తా ప్రాంతం మరింత అనుసంధానం అయ్యేందుకు ఈ కారిడార్‌తో వీలేర్పడుతుందని అధికారిక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే చెన్నై పోర్టు నుంచి నాలుగు లేన్ల కారిడార్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. దీనికి అనుబంధంగా ఇకపై నెలకొనే ఈ కొత్త కారిడార్ రవాణా సౌకర్య ప్రక్రియలో ముఖ్యమైన మైలురాయి కానుంది.
పెయిన్‌కిల్లర్ నిమెసులైడ్ అధిక మోతాదుపై నిషేధం
100 ఎంజిలు దాటితే వాడవద్దు , నిర్ణయం తక్షణ అమలు
ఆరోగ్యపరమైన పెను ముప్పు తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెయిన్ కిల్లర్ నిమెసులైడ్ అధిక మోతాదుపై నిషేధం విధించింది. అంతేకాకుండా నోటితో తీసుకునే ఈ ఔషధం తయారీ, పంపిణీపై అనేక రకాల ఆంక్షలను విధించారు. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నుంచి బుధవారం కీలక ఉత్వర్వులు వెలువడ్డాయి. ఇబ్బందికర అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నందున ఇకపై ఎక్కడ కూడా 100 ఎంజిలకు మించి ఈ పెయిన్‌కిల్లర్‌ను విక్రయించరాదు, పంపిణీకి దిగరాదు. ఎవరూ దీనిని వాడరాదని అధికారులు తెలిపారు. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) సిఫార్పుల మేరకు ప్రభుత్వం అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఈ పెయిన్‌కిల్లర్ పై ఆంక్షలను, నిషేధాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఆరోగ్యపరమైన సమస్యలతో కొందరు ఈ పెయిన్‌కిల్లర్‌ను ఎక్కువ స్థాయిలో తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరికి కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. అధిక మోతాదును తక్షణ రీతిలో నిషేధిస్తారు. ఇక ఇప్పటికే మార్కెట్‌లో పంపిణీలో ఉన్న ఈ రకాన్ని వెనకకు తీసుకోవల్సి ఉంటుందని అధికారిక ప్రకటనలో తెలిపారు. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940 పరిధిలో ఈ పెయిన్‌కిల్లర్ నిషేధం విధింపు, దీనిని అమలు చేయడం జరుగుతుంది. డ్రగ్స్ సంబంధిత సాంకేతిక సలహా మండలితో సంప్రదింపుల తరువాత నిషేధ నిర్ణయం తీసుకున్నారు. అయితే తక్కువ డోసు నిమెసులైడ్ ఓరల్ మందులు అందుబాటులో ఉంటాయి. వీటిపై నిషేధం ఉండదు. వీడిని వాడుకునేందుకు వీలు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.