అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో మళ్లీ డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఎంవిపి సెక్టర్ 11లో 4.5 గ్రాముల ఎండిఎంఎ, 5.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులు వినయ్, సాయి, శ్యామ్ లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వినయ్ అనే వ్యక్తి బెంగళూరు నుంచి విశాఖకు డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నాడు. 25 గ్రాముల డ్రగ్స్ కేసులో స్థానిక ప్రజాప్రతినిధులు కుమారులు ఉన్నారని వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వారిని తప్పిస్తున్నారని వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు.