రాంఛీ: రెండు లోకో రెళ్లు ఢీకొనడంతో 74 మంది గాయపడిన సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గోపేశ్వర్ ప్రాంతంలోని పిపల్ కోటీ టన్నెల్ లో మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో సొరంగం లోపలికి 109 మంది కార్మికులను లోకో రైలు తీసుకెళ్తోంది. అదే సమయంలో పరికరాలు తీసుకెళ్తున్న మరో రైలు ఢీకొనడంతో 70 మంది గాయపడ్డారు. వెంటనే వారిని వివిధ ఆస్పత్రుల తీసుకెళ్లారు. ఎస్‌పి సూర్జిత్ సింగ్ పన్వర్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సొరంగం నుంచి కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించామన్నారు. గాయపడిన వారు ఎక్కువగా ఝార్ఖండ్, ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.