రాష్ట్రంలో యూరియా బస్తాల కోసం రైతుల కష్టా లు ఇప్పట్లో తీరేటట్టు లేదు. గత ఖరీఫ్‌లో యూరి యా బస్తాలు సరిపడా దొరకక రైతులు సొసైటీల గోదాముల ముందు బారులు తీరి నిలబడి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ యాసంగి (రబీ ) సీజన్‌లో కూడా రైతులకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుండే చలిని సైతం లెక్కచేయకుండా యూరియా బస్తాల కోసం నానా తంటాలను ఎదుర్కొన్నారు. వరంగల్, మెదక్, ఖమ్మం తదితర జిల్లాల్లో యూ రియా కోసం రైతులు నానాఅగచాట్లు పడ్డారు. వ రంగల్ జిల్లా, చెన్నారావుపేట మండలంలోని వి విధ గ్రామాల్లోని సొసైటీ గోదాములకు యూరి యా బస్తాలు వచ్చాయన్న విషయం తెలుసుకున్న రైతులు మంగళవారం అర్ధరాత్రి నుండే కొరకరాని చలిని సైతం లెక్కచేయకుండా బారులు తీరి నిలబడ్డారు.
వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు రైతులకు బుధవారం తెల్లవారుజామున టోకెన్లు పం పిణీ చేశారు. అనంతరం పోలీసు పహరా మధ్య యూరియా బస్తాలను అందజేశారు. యూరియా బస్తాలు దొరకని రైతులు నిరాశతో వెను తిరిగి వెళ్లిపోయారు. సరిపడా యూరియా బస్తాలను తెప్పిం చి అందించాలని పలు గ్రామాలలోని రైతులు ఆ గ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా, నెక్కొండ మండలంలోని పలు గ్రామాల్లోని ఆయా సహకార సంఘాల ఎదుట కూడా యూరియా కోసం ఇదే పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలంలోని గ్రోమోర్ ఎరువుల కేంద్రం వద్ద కూడా వేకువజాము నుంచే రైతులు యూరియా కోసం క్యూకట్టారు. వర్షాకాలంలో ఇబ్బంది పడినా, కనీసం యాసంగి పంట వరకైనా ఎరువులు అందుతాయని ఎంతో ఆశించి, మక్క, వరి తదితర పంటలు వేశామని, అయినప్పటికీ తమకు తిప్పలు తప్పడం లేదని పలువురు రైతులు వాపోయారు. మెదక్ జిల్లా, నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో సైతం ఎరువులను దక్కించుకునేందుకు రైతులు గంటల తరబడి క్యూలైన్లలో వేచిచూశారు.